నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఏకంగా బ్యాంకుకే పట్టుకుపోయిన వ్యక్తి

నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఏకంగా బ్యాంకుకే పట్టుకుపోయిన వ్యక్తి

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్‎పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంక్‎లో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లాడు. అతడి దగ్గర 2,08,500 రూపాయిల విలువ చేసే 417 ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. 

ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్‎ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో బ్యాంక్ మేనేజర్ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు చిన్న సాయిలు దగ్గరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగ నోట్ల వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

►ALSO READ | మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది లొంగుబాటు