క్వారంటైన్‌లో తమిళనాడు గవర్నర్ పురోహిత్

క్వారంటైన్‌లో తమిళనాడు గవర్నర్ పురోహిత్

చెన్నై: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతోంది. సాధారణ ప్రజానీకంతోపాటు వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడా వైరస్ దెబ్బకు జంకుతున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో చాలా మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా.. లేటెస్ట్‌గా మరో ముగ్గురికి సోకినట్లు ప్రస్ఫుటమయింది. దీంతో ఆ రా ష్ట్ర గవర్నర్ బన్సారీలాల్ పురోహిత్ ఓ వారంపాటు క్వారంటైన్‌లోకి వెళ్లారు.

‘రాజ్‌భవన్‌లో 38 మందికి టెస్టులు చేశాం. వాటిలో 35 మందికి నెగిటివ్‌గా రాగా ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది’ అని ఓ స్టేట్‌మెంట్‌లో సర్కార్ తెలిపింది. పాజిటివ్‌గా తేలిన స్టాఫ్ మెంబర్స్‌ను స్టేట్ హెల్త్‌ డిపార్ట్‌మెంట్ ఆస్పత్రికి తరలించిందని, వారికి చికిత్స అందుతోందనని సమాచారం. గత వారం రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులు వైరస్ పాజిటివ్‌గా తేలారు. తాజాగా మూడు కేసులను కలుపుకొని చెన్నై రాజ్‌భవన్ వైరస్ పాజిటివ్‌ల సంఖ్య 87కు చేరింది. మంగళవారం రాజ్‌భవన్‌ మెడికల్ ఆఫీసర్ గవర్నర్ పురోహిత్‌కు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాటిల్లో ఆయన హెల్దాగా ఉన్నారని తేలినట్లు అధికార ప్రకటలో వెల్లడించారు. గవర్నర్‌‌ను ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్‌‌ సూచించారని.. దీంతో గవర్నర్ ఐసోలేషన్‌ ఉంటున్నట్లు ప్రకటనలో రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.