వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌‌.. ఎన్నో అనుమానాలు

వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌‌.. ఎన్నో అనుమానాలు

కాన్పూర్‌‌: గ్యాంగస్టర్‌‌ వికాస్‌దుబే ఎన్‌కౌంటర్‌‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌‌పై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. టోల్‌గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌లు, వీడియోలు చూస్తే ఎన్నో అనుమానాలు వస్తున్నాయని వాటి దగ్గర పోలీసులకు సమాధానం లేదని పలువరు ఆరోపిస్తున్నారు. వికాస్‌ దుబే ఉన్న కారు బోల్తా పడిందని, గన్‌ లాక్కుని కాల్చాడని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ అంశంపై పలు అనుమానాలు వస్తున్నాయి. పలువరు లేవనెత్తిన ఐదు ప్రశ్నలకు పోలీసుల దగ్గర సరైన సమాధానం లేదు.

  • తెల్లవారుజామున 4 గంటల సమయంలో టోల్‌గేట్‌ దగ్గర వికాస్‌ దూబే ఉన్న కారు, బోల్తా పడిన కారు ఒకటి కాదు. ఒక కారు నుంచి మరో కారులోకి అతడిని ఎందుకు మార్చారనేది ప్రశ్నగా మిగిలింది.
  • యాక్సిడెంట్‌ అయిన ప్లేస్‌ దగ్గర నుంచి మీడియా వాహనాలను రెండు కిలోమీటర్ల ముందు ఎందుకు ఆపారు?
  • గన్‌ శబ్దాలు వినిపించాయని, యాక్సిడెంట్‌ అయినట్లు ఏమీ కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసులు తమను అసలు అక్కడ ఉండనివ్వలేదని అన్నారు.
  • 60 కేసుల్లో నిందితుడైన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌‌ అని తెలిసి కూడా ఎందుకు సంకెళ్లు వేయలేదు.
  • ఎలాంటి బారికేడ్లు, డివైడర్లు లేనిచోట కారు బోల్తా పడింది.