బంగ్లాలు ఖాళీ చేయని 50 మంది మాజీ ఎంపీలు

బంగ్లాలు ఖాళీ చేయని 50 మంది మాజీ ఎంపీలు
  •    తొందర్లో వెకేట్‌ చేయకపోతే చర్యలు?

న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ ముగిసి ఐదునెలలు గడుస్తున్నా కొంత మంది మాజీ ఎంపీలు మాత్రం బంగ్లాలు ఖాళీ చేయలేదు. ఢిల్లీ లేథియన్స్‌ లోని బంగ్లాలను ఇంకా 50 మంది ఖాళీ చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఖాళీ చెయని వాళ్లపై అమెండెడ్‌ పబ్లిక్‌ ప్రిమిసెస్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అమెండ్‌మెండ్‌ ప్రకారం ప్రభుత్వం షో కాజ్‌ నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోగా రిప్లై ఇవ్వాల్సి ఉంటుందని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటారని అధికారులు చెప్పారు. “ ఇంకా సుమారు 50 మంది మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయాల్సి ఉంది. గడువులోగా ఖాళీ చెయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. బలవంతంగానైనా ఖాళీ చేయిస్తాం” అని అధికారి చెప్పారు. బంగ్లాలు ఖాళీ చెయకపోతే పవర్‌‌, వాటర్‌‌, గ్యాస్‌ కనెక్షన్లు తొలగిస్తామని ఆర్‌‌ పాటిల్‌ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ 200 మంది మాజీ ఎంపీలకు గతంలో నోటీసులు ఇవ్వడంతో చాలా మంది ఎంపీలు ఇళ్లను వెకేట్‌ చేశారు.