V6 News

ఫోర్టిఫైడ్ రైస్ 6 లక్షల టన్నులు తీసుకుంటం

ఫోర్టిఫైడ్ రైస్ 6 లక్షల టన్నులు తీసుకుంటం

యాసంగి సీజన్​కు సంబంధించి 6.33 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ కు కేంద్రం తెలిపింది. శుక్రవారం కేంద్ర ఆహార పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది.  

ఫోర్టిఫైడ్ రైస్ 6 లక్షల టన్నులు తీసుకుంటం రాష్ట్రానికి తెలిపిన కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు: గత యాసంగి సీజన్​కు సంబంధించి 6.33 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటామని రాష్ట్ర సర్కార్​కు కేంద్రం తెలిపింది. శుక్రవారం కేంద్ర ఆహార పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిషనర్‌‌ అశోక్‌‌ కుమార్‌‌ వర్మ ఉత్తర్వులిచ్చారు. పోయిన యాసంగి లో రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్ డిపార్ట్‌‌మెంట్‌‌ రైతుల నుంచి 50.39 లక్షల టన్నుల వడ్లు సేకరించింది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పినందున ఎఫ్​సీఐకి 33.93 లక్షల టన్నుల రా రైస్ ఇవ్వాల్సి ఉంది. నూక శాతం తాము భరించబోమని మిల్లర్లు చెప్పడంతో ఆ నష్టాన్ని తేల్చేందుకు కమిటీ వేయగా, నివేదిక ఇంకా రాలేదు. ఇప్పుడు కేంద్రం 6 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటామని చెప్పడంతో రాష్ట్ర సర్కార్​కు ఊరట కలిగింది.