V6 News

మీకు తెలుసా : రైలు డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది.. వందే భారత్ రైలు డ్రైవర్ ఎంత డ్రా చేస్తాడో తెలుసా..!

మీకు తెలుసా : రైలు డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది.. వందే భారత్ రైలు డ్రైవర్ ఎంత డ్రా చేస్తాడో తెలుసా..!

ప్రజల రవాణా సౌకర్యాలు తీర్చడంలో రైల్వే తర్వాతే మిగతావి. సామాన్యుల నుంచి ధనికుల వరకు అన్ని రకాల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడంలో రైల్వే పాత్ర కీలకం. అలాంటి రైల్వే వ్యవస్థ నడవటంలో లోకో పైలట్ల (డ్రైవర్లు) పాత్ర చాలా ముఖ్యమైనది. మరి ఆ రైళ్లను నడిపే డ్రైవర్ల జీతం ఎంతుంటుందో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా..? రాజధాని, వాతాబ్ది మొదలుకొని వందే భారత్ వరకు లోకో పైలట్లు ఎంత సంపాదిస్తారో తెలుసుకుందాం పదండి.

  • రైలు డ్రైవర్ కెరీర్:

ప్రతీ రైలు డ్రైవర్ కెరీర్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) గా మొదలవుతుంది. బేసిక్ శాలరీ దాదాపు 19,900 రూపాయలు ఉంటుంది. అలొవెన్సులతో కలుపుకుని నెలకు 25 నుంచి 35 వేల వరకు వస్తుంది. ఎక్స్పీరియన్స్, ప్రమోషన్స్ (సీనియర్, చీఫ్ లోకోపైలట్స్) జీతం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. 

  • రాజధాని, శతాబ్ది డ్రైవర్లు ఎంత సంపాదిస్తారు..?

రాజధాని, శతాబద్ది ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలంటే అపారమైన అనుభవం, స్కిల్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న లోకో పైలట్లకు అదనపు బెనిఫిట్స్, ఫిఫ్ట్ అలొవెన్సులు ఉంటాయి. అదే విధంగా దూరాన్ని బట్టి చెల్లింపులు ఉంటాయి. యావరేజ్ గా నెలకు 35 నుంచి 55 వేల రూపాయల వరకు రాజధాని, శతాబ్ది డ్రైవర్లు సంపాదిస్తుంటారు. సీనియారిటినీ బట్టి జీతాల్లో తేడా ఉంటుంది. 

  • వందే భారత్ డ్రైవర్ల జీతం ఎందుకు ఎక్కువ..?

వందే భారత్ ట్రైన్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హై స్పీడ్ తో నడుస్తుంటాయి. వీటిని నడిపే వారికి చాలా ఎక్స్ పీరియన్స్ ఉండాలి. వీటిని నడిపే లోకోపైలట్లకు (లాంగ్ డిస్టెన్స్) రూ.70 వేల నుంచి లక్షా పదివేల రూపాయల వరకు జీతం ఉంటుంది .

  • రైల్వే డ్రైవర్లలో అత్యధికంగా సంపాదించేది ఎవరు..?

లోకో పైలట్లలో అత్యధికంగా సంపాదించేది.. సింపుల్ గా చెప్పాలంటే వందే భారత్ డ్రైవర్లే. ఆ తర్వాత రాజధాని, శతాబ్ది డ్రైవర్లకు ఎక్కువ జీతాలుంటాయి. అనుభవం, రూట్స్, బాధ్యతలను బట్టి జీతాల్లో తేడాలుంటాయి. 

►ALSO READ | బిడ్డను కనమని బలవంతం చేయలేం.. మైనర్ బాలిక గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్: సుప్రీంకోర్టు