పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది రేవంత్ సర్కార్. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మే 1, 2026 నుండి ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని పేర్కొంది ప్రభుత్వం. శిఖా గోయల్, దేవేంద్ర సింగ్ చౌహన్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులను కీలక శాఖలకు బదిలీ చేసింది ప్రభుత్వం. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
శిఖా గోయల్:
ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ ను హోం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అదనంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు శిఖా గోయల్.
దేవేంద్ర సింగ్ చౌహాన్:
ప్రస్తుతం ఏడీజీ ( పర్సనల్ ) గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహన్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. శిఖా గోయల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు దేవేంద్ర సింగ్ చౌహన్.
షహ్నవాజ్ ఖాసిం:
ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న షాహ్నాజ్ ఖాసీంను మల్టీ జోన్-2 ఐజీపీగా బదిలీ చేసింది ప్రభుత్వం. అదనంగా IGP (Personnel) బాధ్యతలు కూడా చేపట్టనున్నారు ఖాసీం.
తరుణ్ జోషి
ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. సుధీర్ బాబు రిటైర్మెంట్ కారణంగా తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం.
►ALSO READ | ప్రాణాలు తీసుకోవద్దు.. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తది: డిప్యూటీ సీఎం భట్టి
అవినాష్ మోహంతి
ప్రస్తుతం మల్కాజిగిరి కమిషనర్ గా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. అదనంగా ఏసీబీ డైరెక్టర్ గా కొనసాగనున్నారు అవినాష్ మొహంతి.
బి. సుమతి:
ప్రస్తుతం ఎస్ఐబీ IG గా ఉన్న సుమతిని మల్కాజిగిరి కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం.
కార్తికేయ
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ IG గా ఉన్న కార్తికేయకు ఎస్ఐబీ IGగా అదనపు బాధ్యతలు కేటాయించింది ప్రభుత్వం.

