హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్‌యార్డు ఇప్పుడు మిథేన్వంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ప్లేస్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
భయంకరమైన నిజాలు బయటకు
యూసీఎల్ఏ ప్రొఫెసర్లు, రీసెర్చ్స్కాలర్స్జవహర్నగర్ డంపింగ్యార్డ్పరిస్థితి చూసి కంగారుపడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని, భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. ఈ డంపింగ్‌యార్డు నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్వాయువు విడుదలవుతోందని, పరిశోధనలో తెలుసుకుని షాక్అయ్యారు. ఈ మిథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని, ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్.. రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానమని పేర్కొన్నారు. చివరకు పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డుల్లో జవహర్‌నగర్ ది నాలుగో స్థానమని తేలింది.
టాప్ 25లో రెండు మనవే..
ప్రపంచవ్యాప్తంగా 700 పైగా డంపింగ్ యార్డులను పరిశీలిస్తే.. టాప్ 25లో ఇండియా నుంచి రెండు యార్డులున్నాయి. అందులో ఒకటి జవహర్‌నగర్ (నాలుగో స్థానం) కాగా, మరోటి ముంబైలోని కంజుర్ మార్గ్ డంపింగ్‌యార్డు..ఇక్కడ గంటకు 4.9 టన్నుల మిథేన్వస్తోందని తేలింది. ఇక అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ యార్డు గంటకు 7.9 టన్నుల మిథేన్విడుదలతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
మీథేన్ఎంత డేంజర్ అంటే..
కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ సుమారు 86 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్‌లో 45శాతం కంటే ఎక్కువ వాటా ఈ మిథేన్దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం డంపింగ్ యార్డు చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్నేండ్లలోనే ఊపిరితిత్తులు పాడైపోవడం ఖాయం. మిథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. తల తిరగడం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

