ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

పేపర్లు లాక్కుని, చింపి విసిరి న సభ్యులు
సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టి న జోషి.. ఆమోదం
ఈ బడ్జెట్ సమావేశాలయ్యే వరకు వారి కి నో ఎంట్రీ

సస్పెండైన ఎంపీలు
1.గౌరవ్ గొగోయ్ ,
2.టి.ఎన్.ప్రతాపన్, 3.డీన్
కురియకొసె, 4.గుర్జీత్ సిం గ్
ఔజ్లా, 5.బెన్నీ బెహనన్,
6.మాణికం ఠాగూర్,
7.రాజ్ మోహన్ ఉన్నిథన్

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంపై ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బెనివాల్ చేసిన కామెంట్స్​లోక్ సభలో దుమారం లేపాయి. ఢిల్లీ అల్లర్లపై చర్చకు కాంగ్రెస్,
ఇతర ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో గురువారం ఎలాంటి కీలక అంశాలపై చర్చ లేకుండానే రెండు
సభలూ వాయిదా పడ్డాయి. మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై లోక్ సభలో వేటు పడింది. హౌస్ లో ప్రవర్తన సరిగా లేదని, రూల్స్ ​పాటించడం లేదని వారిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. స్పీకర్ టేబుల్ నుంచి పేపర్లు లాక్కో వడం, పేపర్లు విసరడం చేశారని, రూల్స్​కు వ్యతిరేకంగా సభ్యులు ప్రవర్తించారని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే సస్పెన్షన్ పై కాంగ్రెస్ అభ్యంతరం తెలపడంతో.. విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు.

‘సోనియా ఫ్యామిలీకి కరోనా టెస్టులు చేయాలి’

రోజంతా నిరసనలు కొనసాగడంతో లోక్ సభ నాలుగు సార్లు వాయిదా పడింది. సోనియా గాంధీపై కాంట్రవర్షియల్ కామెంట్స్​చేసిన ఎంపీ హనుమాన్ బెనివాల్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. రాజస్థాన్ లోని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ మాట్లాడు తూ.. సోనియా గాంధీతోపాటు, ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయాలని కామెంట్ చేశారు. దేశంలో కరోనా వైరస్‌‌‌‌ పాజిటివ్‌ గా తేలిన వారిలో ఎక్కువ మంది సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చిన వారేనని అన్నారు. బెనివాల్‌‌‌‌ కామెంట్స్​పై కాంగ్రెస్‌‌‌‌ ఎంపీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభ వాయిదా పడింది.

పోడియం నుంచి పేపర్లు లాక్కుని..

తర్వాత హౌస్ ప్రారంభం కాగానే.. బెనివాల్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రొటెస్టులు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అప్పుడు కూడా కాంగ్రెస్ మెంబర్లు వెల్ లోకి వెళ్లి ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు చైర్ లో ఉన్న రమాదేవి.. సభను అలానే కొనసాగించారు. దీంతో ‘ఎంపీని సస్పెండ్ చేయండి’, ‘మోడీ సర్కార్ షేమ్ షేమ్’ అని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. మినరల్ చట్టాల (అమెండ్ మెంట్) బిల్లును పాస్ చేసే ప్రక్రియను కొనసాగిస్తుండగా.. స్పీకర్ పోడియం నుంచి పేపర్లు లాక్కు న్న ఎంపీ గౌరవ్ గొగోయ్ వాటిని చింపి విసిరారు. దీంతో సభ 3 గంటలకు వాయిదా పడింది.

ఏడుగురి పేర్లు చదివి..

మధ్యాహ్నం 3 గంటలకు సభ మళ్లీ సమావేశమైంది. ఆ సమయంలో హౌస్ ను మీనాక్షీ లేఖీ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు నిరసనలు కొనసాగించారు. మినరల్ చట్టాల బిల్లు గురించి చర్చిస్తున్నప్పుడు కొందరు మెంబర్లు పేపర్లు లాక్కున్నారని, వాటిని స్పీకర్ పోడియం మీదికి విసిరారని లేఖీ చెప్పారు. ‘‘ఇలాంటి దురదృష్ట ఘటన పార్లమెంట్ చరిత్రలో తొలిసారి జరిగి ఉండొచ్చు. ఈ ప్రవర్తనను నేను ఖండిస్తున్నా ” అని ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల పేర్లు చదివారు. స్పీకర్ ఒకసారి మెంబర్ పేరు చదివితే సదరు సభ్యుడు ఆ రోజుకి సభలో ఉండటానికి వీలులేదని రూల్స్ చెబుతున్నా యి. తర్వాత సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఏడుగురు సభ్యుల్ని మిగిలిన బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకు (ఏప్రిల్3) సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం పెట్టారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభ ఆ తీర్మానాన్ని వాయిస్ ఓటుతో ఆమోదించింది. ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లాలని లేఖీ ఆదేశించారు. తర్వాత సభ వాయిదా పడింది.

చైర్ ను అగౌరవ పరుస్తా రా?: బీజేపీ

కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ను బీజేపీ స్వాగతించింది. స్పీకర్ టేబుల్ నుంచి పేపర్లు లాక్కో వడం అంటే చైర్ ను అగౌరవ పరచడమేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. కాంగ్రెస్ ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనేందుకు వీలుగా ప్యానల్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరామని చెప్పారు.

ఇది బజారు కాదు: వెంకయ్య

ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ కాం గ్రెస్​తోపాటు ఇతర పార్టీలు నిరసనలు చేయడం, ఆపకుండా స్లోగన్లు చేయడంతో రాజ్యసభ గురువారం వాయిదా పడింది. ప్రొటెస్ట్ చేస్తున్న మెంబర్లపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెం కయ్యనాయుడు సీరియస్ అయ్యారు “ఇది పార్లమెంట్.. బజారు కాదు”
అని ఫైర్ అయ్యారు. అయినా కాం గ్రెస్, తృణమూల్, ఆప్ ఎంపీలు వెల్​లో కి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఢిల్లీ గొడవలపై చర్చకు అనుమతి ఇవ్వకుం టే సభా కార్యక్రమాలను జరగనివ్వబోమని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్, ఇతర ప్రతిపక్ష నాయకులు నిర్ణయించారు.
కండిషన్లపై సభ నడపడం కుదరదని ప్రతిపక్షాలకు వెంకయ్య స్పష్టం చేశారు. ఈనెల 11, 12 తేదీల్లో ఢిల్లీ అల్లర్లపై సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ చెప్పారు.

రివెంజ్ పాలిటిక్స్: కాంగ్రెస్

​తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం నియంతృత్వమని కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ లో చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందని, సస్పెన్షన్ పేరుతో అపొజిషన్ ను బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించింది. “ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కానీ స్పీకర్ తీసుకున్నది కాదు. మా పార్టీ సభ్యులు తప్పుగా ఏమీ చేయలేదు. ఇవి ప్రతీకార రాజకీయాలు” అని లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధురి అన్నారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి