7 జోన్లు, 71 పోలీస్ స్టేషన్లతో సిటీ కమిషనరేట్

7 జోన్లు, 71 పోలీస్ స్టేషన్లతో సిటీ కమిషనరేట్
  •     మెగా సిటీ పోలీసింగ్​లో భాగంగా 35 ఏండ్ల తర్వాత రీ ఆర్గనైజేషన్
  •     కొత్తగా 13 ట్రాఫిక్ పోలీస్‌‌‌‌ స్టేషన్లు


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో పాటు డైలీ 80 లక్షల 70 వేల వెహికల్స్ తిరుగుతున్నాయి. దీంతో లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, క్రైమ్‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌ సహా ప్రజా భద్రత కోసం సిటీ పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ను పునర్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థీకరించారు.‘మెగా సిటీ పోలీసింగ్‌‌‌‌’లో భాగంగా 35 ఏండ్ల తర్వాత సమూల మార్పులు చేశారు. మరో15 ఏండ్లకు వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త జోన్లు, డివిజన్లు, పోలీస్‌‌‌‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్ వివరాలను శనివారం  బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్‌‌‌‌ అండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్‌‌‌‌ సీపీలు విక్రమ్‌‌‌‌సింగ్‌‌‌‌ మాన్‌‌‌‌, సుధీర్‌‌‌‌‌‌‌‌బాబు, ఇతర పోలీస్‌‌‌‌ అధికారులు పాల్గొన్నారు.

20 ఏండ్ల కిందట సెమీ రీ ఆర్గనైజేషన్

2002లో హైదరాబాద్ కమిషనరేట్‌‌‌‌ను సెమీ రీ ఆర్గనైజేషన్ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, వెహికల్స్​ కారణంగా సిటీ కమిషరేట్ రీ ఆర్గనైజేష న్ కు  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ నేతృత్వంలోని స్పెషల్‌‌‌‌ కమిటీ 6 నెలల పాటు శ్రమించి రీ ఆర్గనైజేషన్​కు రూపకల్పన చేసింది. ఈ కమిటీ ఇచ్చిన ప్రపోజల్స్‌‌‌‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, సౌత్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌‌‌‌(డీసీపీ)జోన్లు,11 అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ పోలీస్‌‌‌‌(ఏసీపీ) డివిజన్లు,11 లా అండ్ ఆర్డర్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్లు,13 ట్రాఫిక్, 5 విమెన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాత పోలీస్‌‌‌‌స్టేషన్లతో కలిపి ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌‌‌‌ పరిధి 7 డీసీపీ జోన్లు,28 ఏసీపీ డివిజన్స్,71 పోలీస్‌‌‌‌స్టేషన్లకు చేరింది.

బీఆర్కే భవన్​లో సెక్రటేరియట్ పీఎస్

బీఆర్కే భవన్‌‌‌‌లోని గ్రౌండ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో సెక్రటేరియట్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పేరుతో కొత్త పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ పరిధిలోని రాంగోపాల్‌‌‌‌పేట, మహంకాళి, పంజాగుట్ట, సైఫాబాద్‌‌‌‌లో కొంత భాగం పీఎస్‌‌‌‌ పరిధిలోకి తీసుకొచ్చారు. బీఆర్కే భవన్‌‌‌‌లోనే ఏసీపీ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీంతో పాటు సెక్రటేరియట్ బందోబస్తు కోసం 30 మంది లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు, ట్రాఫిక్ మానిటరింగ్ కోసం 21 మందితో స్పెషల్ యూనిట్స్‌‌‌‌ ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో రెండు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ను పెంచడంతో ప్రస్తుతం వీటి సంఖ్య ఏడుకు చేరింది. టాస్క్​ఫోర్స్ టీమ్స్ లో మొత్తం 209 మందిని నియమించారు.

సరిహద్దు‌‌‌‌ వివాదాలు రాకుండా..

పోలీస్‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌ పరిధి విషయంలో సరిహద్దు వివాదాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మెయిన్‌‌‌‌ రోడ్లు, ఇంటర్నల్‌‌‌‌ రోడ్లు, మూసీ నది, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల మధ్య నుంచి ఇరువైపులా ఉన్న పోలీస్‌‌‌‌స్టేషన్లకు సమానంగా పరిధిని డివైడ్ చేశారు. మెట్రో, పీవీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవేల వద్ద పిల్లర్‌‌‌‌‌‌‌‌ నంబర్స్ ఆధారంగా సంబంధిత పీఎస్‌‌‌‌ల పరిధిని నిర్ధారించారు. దీంతో సరిహద్దులో ఏదైనా నేరం జరిగితే రెండు పోలీస్‌‌‌‌స్టేషన్ల మధ్య జూరిడిక్షన్ వివాదం నెలకొనే అవకాశాలు ఉండవు. 5 జోన్లలో ఒక్కో విమెన్ పోలీస్‌‌‌‌ స్టేషన్ చొప్పున ఐదింటిని ఏర్పాటు చేశారు. ప్రతి పీఎస్‌‌‌‌లో ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు 32 మంది సిబ్బందిని నియమించారు.

కొత్తగా ఏర్పాటైన జోన్లు, డివిజన్లు, పోలీస్‌‌‌‌ స్టేషన్లు

డీసీపీ జోన్: సౌత్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, సౌత్‌‌‌‌ వెస్ట్
ఏసీపీ డివిజన్లు: గాంధీనగర్‌‌‌‌‌‌‌‌, చిలకలగూడ, ఓయూ, తిరుమలగిరి, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, కుల్సుంపురా, ఛత్రినాక, జూబ్లీ
హిల్స్‌‌‌‌, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌
పోలీస్‌‌‌‌స్టేషన్లు:  దోమలగూడ, సెక్రటేరియట్‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌‌‌‌ సదన్‌‌‌‌, గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌, ఫిల్మ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మాసబ్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌, మధురానగర్‌‌‌‌, బోరబండ.

ట్రాఫిక్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్

డీసీపీ ట్రాఫిక్‌‌‌‌ డిస్ట్రిక్ట్- 3, సౌత్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ ఏసీపీ డివిజన్‌‌‌‌
ట్రాఫిక్ పీఎస్​లు: ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, జూబ్లీహిల్స్, టోలిచౌకి, లంగర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌, మారేడ్‌‌‌‌పల్లి, బోయిన్‌‌‌‌ పల్లి, బహదూర్‌‌‌‌‌‌‌‌పురా, సంతోష్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, చాంద్రయణగుట్ట, అమీర్‌‌‌‌‌‌‌‌పేట, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ.

సిటిజన్లకు మంచి సర్వీస్ అందిస్తం

అన్ని కొత్త పోలీస్‌‌‌‌ స్టేషన్లలో జూన్‌‌‌‌ 2న మొదటి ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్ చేస్తం. ఇప్పటికే పోలీస్‌‌‌‌స్టేషన్ల నిర్వహణ కోసం ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌, వెహికల్స్, కంప్యూటర్లు కొనుగోలు చేశాం. ఏఆర్‌‌‌‌‌‌‌‌(ఆర్మ్ డ్ రిజర్వ్) అటాచ్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న సివిల్‌‌‌‌ పోలీసులను గుర్తించాం. అందరినీ తిరిగి సివిల్‌‌‌‌కి తీసుకొచ్చాం.రీ ఆర్గనైజేషన్‌‌‌‌ వల్ల సిటిజన్లకు మరింత బెటర్ సర్వీస్ అందుతుంది. కేసుల దర్యాప్తు కూడా వేగవంతం అవుతుంది. సిబ్బందికి 
పనిభారం తగ్గుతుంది.
- సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్