95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్

95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్

ఉత్తరాది రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ రోజురోజుకు పెరిగిపోతుంది. బీహార్నుంచి ఉత్తరప్రదేశ్కు పిల్లల అక్రమ రవాణా చేస్తుండగా శుక్రవారం (ఏప్రిల్ 26)  యూపీ పోలీసు లు, చైల్డ్ కమిషన్ సభ్యులు రక్షించారు. ఓ బస్సులో మొత్తం 95 మంది చిన్నారులను  ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్లోని ఓ మదర్సాకు ఈ పిల్లలను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పిల్లలంతా యూపి చైల్డ్ కమిషన్ సంరక్షణలో ఉన్నారు. పిల్లలకు ఆహారం, అవసరమైన వారికి చికిత్స చేయిస్తున్నారు. 

చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వారిని రక్షించారు. చిన్నారులంతా 4-12 ఏళ్లలోపు వారే. 

ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన పిల్లలను వివిధ రాష్ట్రాల్లో  మదర్సాలకు పంపుతుండగా..గోరఖ్ పూర్ లో ఉత్తర ప్రదేశ్ చైల్డ్ కమిషన్ సభ్యులు, పోలీసులు రక్షించారు.కనీసం ఎక్కడి వెళుతున్నామో కూడా తెలియని చిన్నారులను అక్రమంగా మదర్సాలకు తరలిస్తున్నారు. 

భారత రాజ్యాంగం ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు కల్పించింది.. ప్రతి చిన్నారి బడికి వెళ్లడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పేద పిల్లలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి మదర్సాలలో ఉంచి మతం ఆధారంగా విరాళాలు పొందుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన' అని  యూపి చైల్డ్ కమిషన్ చైర్ పర్సన్ అన్నారు.