సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు

సచ్చిన కోడికి కూడా రెక్కలు..  భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు

వేసవికాలంలో ఎండ తీవ్రత కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతారు. నోటికి రుచిగా ఎదో ఒకటి చేసుకొని తింటుంటారు. ఈ టైంలో ఫంక్షన్లు కూడా బానే జరుగుతుంటాయి. మాంసం ప్రియులు నాన్ వెజ్ వైపు చూసే పరిస్థితులు లేవు. కేజీ కోడి కూర ధర రోజురోజుకు ఆకాశానికి ఎగబాకుతుంది.  అందరూ ఇష్టపడే, ఎక్కువగా తినే చికెన్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి దాక రూ.250-300 ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు రూ.320కి చేరింది.  

ఈరోజు తెలంగాణాలో కిలో చికెన్ రూ.319లుగా ఉంది. హైదరాబాద్ లో చికెన్ లైవ్ కేజీ రూ.180గాను, స్కిన్ లెస్  రూ.390 నడుస్తోంది. బోన్ లెస్, కంట్రీ చికెన్ కేజీ ఏకంగా రూ.500 లకు పైనే పలుకుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధర దాదాపు రూ.100 తక్కువగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో  కిలో కోడి  కూర ధర రూ.210 ఉంది.