- అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీలు నమోదు
- రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్న జనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాత్రి టెంపరేచర్లు మరింత పడిపోయాయి. 8 డిగ్రీల కంటే తక్కువకు చేరుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 13 డిగ్రీల రేంజ్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రాత్రి అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది.
ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 8.3, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 8.8, మెదక్ జిల్లా శివంపేటలో 9, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 9.1, ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూరులో 9.3, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 9.4, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.4, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 9.7 డిగ్రీల రాత్రి టెంపరేచర్ నమోదైంది.
జగిత్యాల జిల్లా గోవిందారంలో 10.7, నిర్మల్ జిల్లా పెంబిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, మరో తొమ్మిది జిల్లాల్లో 11 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోయాయి.
అత్యల్పంగా బీహెచ్‌ఈఎల్‌లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, హెచ్‌సీయూలో 11, కంటోన్మెంట్‌లో 11.4, వెస్ట్ మారేడ్‌పల్లి, మచ్చబొల్లారం, గచ్చిబౌలిల్లో 11.7, ఆదర్శ్‌నగర్‌లో 11.9 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. చలి తీవ్రత రోజురోజూకు పెరుగుతుండటంతో రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే జనం భయపడుతున్నారు.
