CIBIL Rules: సిబిల్ స్కోర్ కొత్త రూల్స్.. ఇక ఉచిత రిపోర్ట్, అలర్ట్స్ సౌకర్యం..

CIBIL Rules: సిబిల్ స్కోర్ కొత్త రూల్స్.. ఇక ఉచిత రిపోర్ట్, అలర్ట్స్ సౌకర్యం..

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్ ట్రాన్స్‌పరెన్సీ కోసం కొత్తగా 5 కఠినమైన రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రజలకు క్రెడిట్ స్కోర్ కి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందించి సరికొత్త పారదర్శకతను తీసుకొస్తోంది రిజర్వు బ్యాంక్.

* క్రెడిట్ సమాచారం రెండు వారాల తరవాత (15వ తేదీ, నెల చివరి తేదీ) ఇకపై అప్ డేట్ చేయబడనుంది. దీనివల్ల లేటెస్ట్ పేమెంట్స్ లేదా లోన్ క్లోజర్ రెగ్యులర్‌గా క్రెడిట్ స్కోర్‌లో ప్రతిబింబిస్తుంది.

* ప్రతి సారి మీ క్రెడిట్ రిపోర్ట్ ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు ఆ వివరాలను SMS లేదా ఇమెయిల్ ద్వారా వెంటనే అలర్ట్ రూపంలో అందించాల్సి ఉంటుంది.

* లోన్ లేదా క్రెడిట్ కార్డు రిజెక్షన్ జరిగినప్పుడు.. దానికి సంబంధించి ఖచ్చితమైన కారణం బయటపెట్టాలి. గతంలో ఇది సాధారణంగా రహస్యంగా ఉంచబడేది. ఇది వ్యక్తి సిబిల్ స్కోర్ మెరుగుపరుచుకునేందుకు దోహదపడనుంది. 

* ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి.. ప్రతి వినియోగదారికి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా పూర్తి క్రెడిట్ రిపోర్ట్ అందించాలని రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. 

►ALSO READ | ఆహార ధరల పతనంతో 27 నెలల కనిష్ఠానికి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం..

* వినియోగదారులు తమ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏదైనా పొరపాట్లు లేదా తప్పులను గమనిస్తే 30 రోజుల్లో దాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. ఈ కాలంలో తప్పులను సరిచేయకపోతే క్రెడిట్ బ్యూరోకు రోజుకు రూ.100 చొప్పున జరిమానా విధించబడుతుంది.

కొత్త రూల్స్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ రుణ సంస్థలతో పాటు అన్ని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్‌కు వర్తిస్తాయి. తద్వారా లోన్స్ పొందే పద్దతులు మరింత స్పష్టంగా మారి, ఎప్పుడైనా ఎవరి క్రెడిట్ రిపోర్ట్ యాక్సెస్ చేశారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ప్రజలు తమ క్రెడిట్ హెల్త్ పై స్పష్టమైన అవగాహన పొందేందుకు వీలుపడుతుందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.