- ఎండీ అనిల్ మోహన్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ గ్రూప్ జహీరాబాద్ ప్లాంట్‌లో బస్సుల తయారీని మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇది బెల్గావ్ యూనిట్‌లో వాటిని ఉత్పత్తి చేస్తోంది. జహీరాబాద్ 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ఎంజీ గ్రూప్ సీఎండీ అనిల్ మోహన్ కామత్ పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మోహన్ వసంత్ కామత్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తన తండ్రి ఆశయాలను గుర్తు చేస్తూ భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించారు. జహీరాబాద్ ప్లాంట్‌ను భారీ వాహన తయారీ కేంద్రంగా మార్చుతామని, కొత్త పెట్టుబడులతో ప్లాంట్‌ను ఆధునీకరించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. ఓఈఎంలు, ఎస్టీయూలకు రవాణా రంగంలో ఎంజీ గ్రూప్ ఒక నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతుందని అనిల్ ప్రకటించారు.
