ఇల్లు చేతికొచ్చాకే ఈఎంఐ మొదలు..అన్విత గ్రూపు కొత్త స్కీమ్‌

ఇల్లు చేతికొచ్చాకే ఈఎంఐ మొదలు..అన్విత గ్రూపు కొత్త స్కీమ్‌

హైదరాబాద్​, వెలుగు: రియల్​ఎస్టేట్​ సంస్థ అన్విత గ్రూప్‌ 10/90 స్కీమ్‌ ప్రారంభించింది. కొనుగోలుదారులు ఫ్లాట్‌ ధరలో 10 శాతం ముందస్తుగా చెల్లించాలి. ఇల్లు చేతికి వచ్చాకే ఈఎంఐ మొదలవుతుంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌ కొల్లూరులో హై- నైన్​, ఇవానా ప్రాజెక్టులతో పాటు మేడ్చల్‌లో పార్క్‌ సైడ్‌ విల్లాలు నిర్మిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలోనూ కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. 

హై- నైన్​ అపార్టుమెంటులో1.6 కిలోమీటర్ల స్కైవాక్‌ ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ఎండీ అచ్యుత రావు తెలిపారు. 2029 నాటికి 11 వేల యూనిట్లు అందించడమే లక్ష్యమన్నారు.