జమ్మూకాశ్మీర్ లో అర్థరాత్రి పేలుడు జరిగింది. శనివారం(నవంబర్ 15) తెల్లవారు జామున నౌగామ్ పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి పలు వాహనాలు కూడా ధ్వంసం అయినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టెర్రిరిస్టు లనుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, ఫోరెన్సిక్ బృందం అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో పేలుడు జరిగిన నాలుగు రోజుల తర్వాత జమ్మూలో పేలుడు కలకలం రేపుతోంది.
