IND vs SA: దిగ్గజాలను వెనక్కి నెట్టి టాప్‌లోకి.. కోల్‌కతా టెస్టులో బుమ్రా వరల్డ్ రికార్డ్

IND vs SA: దిగ్గజాలను వెనక్కి నెట్టి టాప్‌లోకి.. కోల్‌కతా టెస్టులో బుమ్రా వరల్డ్ రికార్డ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సూపర్ స్పెల్ తో మెరిశాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి సెషన్ లో రెండు వికెట్లు పడగొట్టి సఫారీ ఓపెనర్లను పెవిలియన్ కు పంపాడు. శుక్రవారం (నవంబర్ 14) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బుమ్రా తన మ్యాజికల్ స్పెల్ తో ఒక వరల్డ్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కనీసం 200 వికెట్లు తీసుకున్న బౌలర్లలో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 

బుమ్రా 51 టెస్టుల్లో 19.70 యావరేజ్ తో 228 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 200 పైగా వికెట్లు తీసి 20 తక్కువ యావరేజ్ ఉన్న బౌలర్ బుమ్రా ఒక్కడే కావడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ 20.9 యావరేజ్ తో బుమ్రా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రబడా (22), కమ్మిన్స్ (22.1) టాప్-10 లో ఉండి బుమ్రా వెనక ఉన్నారు. తొలి సెషన్ లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 4 మేడిన్ ఓవర్లు వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా బ్యాటర్లు బుమ్రా బౌలింగ్ ఆడడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 

బుమ్రా దెబ్బకు సఫారీ ఓపెనర్లు ఔట్:

ప్రమాదకరంగా మారుతున్న మార్క్రామ్ (31), రికెల్టన్ (23) జోడీని బుమ్రా విడగొట్టాడు. ఒక ఇన్ స్వింగ్ బాల్ తో రికెల్టన్ ను బౌల్డ్ చేశాడు. దీంతో 57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో కుదురుకుని మంచి టచ్ లో కనిపించిన మార్క్రామ్ ను బుమ్రా ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు.  ఓ వైపు పొదుపుగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా మరోవైపు వికెట్లు పడగొడుతున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు మొదటి సెషన్ లో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్ లో క్రీజ్ లో టోనీ డి జోర్జీ (15), వియాన్ ముల్డర్ (22) ఉన్నారు. ఇండియా బౌలర్లలో బుమ్రా రెండు.. కుల్దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.