బీహార్ ఫలితాలపై రాహుల్ విస్మయం.. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపణ

బీహార్ ఫలితాలపై రాహుల్ విస్మయం.. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపణ

భారత్ జోడో యాత్ర, ఓటర్ అధికార్ యాత్ర, ఓట్ చోరీ.. ఇలా వినూత్న ప్రచారాలతో..  సరికొత్త పరిష్కారాలు ఆవిష్కరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాహుల్ గాంధీ.. బీహార్ లో ఈ సారి మహాగట్బంధన్ కూటమి గెలుస్తుందనే విశ్వాసంలో ఉన్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. 2025 నవంబర్ 14వ తేదీన విడుదలైన బీహార్ అసెంబ్లీ ఫలితాలపై ఆయన స్పందించారు. 

బీహార్ రిజల్ట్స్ ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి సక్రమంగా జరగలేదని ఆరోపించారు. రిజల్ట్స్ విడుదలైన తర్వాత సాయంత్రం ఎక్స్ లో పోస్ట్ చేశారు రాహుల్. 
బీహార్ ఎన్నికల్లో 243 సీట్లలో అధికార ఎన్డీఏ 200 సీట్లకు పైగా గెలుకుంటే.. ప్రతిపక్ష మహాగట్బంధన్ కూటమి 40 సీట్లు కూడా క్రాస్ చేయలేకపోయింది. దీనిపై స్పందించిన రాహుల్.. బీహార్ ఫలితాలు విస్మయానికి గురిచేశాయని అన్నారు. 

►ALSO READ | ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచిన తేజస్వి యాదవ్.. కానీ.. అంత సేఫ్ సీటులో ఇంత కష్టంగానా..!

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పెద్ద యుద్ధం జరుగుతోందని అన్నారు. మహాగట్బంధన్ కూటమిపై నమ్మకం ఉంచిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నికల ప్రక్రియ ఇలాగే జరిగితే మేము ఎప్పటికీ గెలవలేము అని అన్నారు.  ఎందుకంటే నిజాయితీతో, నిబంధనల ప్రకారం సక్రమంగా జరిగకుండా ఫలితాలను మిస్ మ్యాచ్ చేస్తూ సాగే ఎన్నికలలో ఎవరూ గెలవలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ ఫలితాలపై విశ్లేషిస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేస్తామని చెప్పారు రాహుల్.