చిరుత వరుస దాడులు పట్టించుకోని ఫారెస్ట్ సిబ్బంది

చిరుత వరుస దాడులు పట్టించుకోని ఫారెస్ట్ సిబ్బంది

లింగంపేట, వెలుగు: మండలంలోని ఎల్లమ్మతండా, గాంధీనగర్ గ్రామాల్లో చిరుతపులి వరుసదాడులు చేస్తూ లేగదూడలను చంపుతోంది. ఈనెల 14న ఎల్లమ్మతండా సమీపంలో దెగావత్​దేవిసింగ్​కు చెందిన లేగదూడ ను చిరుత హతమార్చింది.19న గాంధీనగర్ సమీపంలో షేక్​రజాక్ అనే రైతుకు చెందిన రెండు లేగదూడలను చంపేసింది.

శనివారం రాత్రి ఎల్లమ్మ తండా సమీపంలో సబావత్ సామ్నీకి చెందిన దూడను చిరుత చంపింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎఫ్​డీవో రామకృష్ణ ఆదేశించినప్పటికీ బోను రిఫేర్​అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రెండు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో.. 

సిరికొండ : మండలంలోని సిరికొండ ఫారెస్ట్ రేంజ్​ పరిధిలోని తాటిపల్లి, జినిగ్యాల, చిమన్​పల్లి, పందిమడుగు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్​ఆర్వో నర్సింగ్ రావు తెలిపారు. రుద్రంగి, మోత్కురావుపేట, సిరిసిల్లా, జగిత్యాల జిల్లా ఫారెస్ట్​లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో  సంచరించే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.