భారత్ ప్రతిష్టను దెబ్బతీశారు... ఏఐ సమిట్‌‌‌‌‌‌‌‌ లో నిరసనపై ఢిల్లీ కోర్టు ఫైర్

భారత్ ప్రతిష్టను దెబ్బతీశారు... ఏఐ సమిట్‌‌‌‌‌‌‌‌ లో నిరసనపై ఢిల్లీ కోర్టు ఫైర్

న్యూఢిల్లీ: ఏఐ  సమిట్ లో  కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనను ఢిల్లీ కోర్టు  తీవ్రంగా తప్పుబట్టింది. ఇది శాంతిభద్రతలపై జరిగిన దాడి అని, భారత దౌత్య ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను విచారణ కోసం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు శనివారం అనుమతించింది. 

వారు పరారీలో ఉండే అవకాశం ఉందని, విదేశీ కుట్రలతో సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది.