Renu Desai: ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి.. వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ పోస్ట్!

Renu Desai: ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి..  వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ పోస్ట్!

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది సినీ నటి రేణూ దేశాయ్. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.  దైవభక్తి ఎక్కువగా ఉన్న ఆమె ఇటీవల పవిత్ర నగరం కాశీ లో చేసిన పర్యటనకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, ఆమె నుదిటిపై శివ-విష్ణువుల తిలకాలు ఒకేసారి కనిపించిన అపురూప ఘట్టాన్ని వివరిస్తూ చేసిన పోస్ట్ భక్తులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

శివుడి పిలుపు...

అక్కడ దిగిన కొన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు రేణూ దేశాయ్. ఈ ఫోటోలలో ఆమె గంగా తీరాన, చారిత్రక ఘాట్‌ల వద్ద ఆలయాల ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కాల భైరవ జయంతి సందర్భంగా ఆమె చేసిన క్యాప్షన్ చాలా లోతైన అర్థాన్ని కలిగేలా తన పోస్ట్‌లో రాశారు. “కాల భైరవి జయంతి రోజున, మనం కేవలం రక్షణ కోరకూడదు... మనమే రక్షకులుగా మారాలి. కాల భైరవుడు మీతో పాటు నడుస్తూ, ప్రశాంతమైన శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమ శివుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, మీరు అన్ని లౌకిక విషయాలను వదిలిపెట్టి కాశీకి వెళ్తారు.” అని పోస్ట్ చేశారు. ఆమె ఫోటోలతో పాటు ఈ సందేశం అభిమానులకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

శాంతి వైపు నడిపించినట్లుగా..

రేణూ దేశాయ్ సాధారణంగా పరమ శివుడి భక్తురాలైనప్పటికీ, ఈ కాశీ పర్యటనలో ఆమె మొదటిసారిగా బిందు మాధవ్ (విష్ణు) ఆలయాన్ని సందర్శించారు. ఆ అనుభవాన్ని వివరిస్తూ, "నేను శివుడి భక్తురాలిని అని చాలా మందికి తెలుసు. కానీ కాశీ యాత్రలో మొదటిసారిగా విష్ణు ఆలయాన్ని సందర్శించినప్పుడు, దైవం ముందు వంగి నమస్కరించగానే, పూజారి నా నుదిటిపై నిలువు నామంపెట్టారు. శివుడి అగ్ని నన్ను కృష్ణుడి శాంతి వైపు నడిపించినట్లుగా అనుభవించాను. త్రిపుండ్రం  ధరించే నాకు, జీవితంలో మొదటిసారిగా ఊర్ధ్వ నామం ధరించడం చాలా విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

►ALSO READ | Buchibabu Sana: 'పెద్ది' డైరెక్టర్ లక్కీ ఛాన్స్.. బాలీవుడ్ కింగ్‌తో పాన్-వరల్డ్ మూవీ!

శివ, విష్ణు తిలకాల అద్భుత మిళితం

ఆ తర్వాత ఆమె మణికర్ణికా ఘాట్‌లోని బాబా మశానాథ్ ఆలయానికి వెళ్లి కళ్లు మూసుకొని జపం చేస్తున్నప్పుడు, గతంలో ఆమెను చూసిన ఒక పూజారి వచ్చి, మాట లేకుండా, పరమ శివుడి పవిత్రమైన బూడిద అయిన తడి విభూతి ని ఆమె నుదిటిపై అలంకరించారని రేణూ దేశాయ్ చెప్పారు. ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు తన స్నేహితులు ఆశ్చర్యపోవడం చూసి, శివుడి త్రిపుండ్రం , మాధవుడి ఊర్ధ్వ పుండ్రం  ఒకదానిపై ఒకటి ఉండడం గమనించానని రేణూ తెలిపారు. 'విష్ణువు స్థలం  అయితే, శివుడు కాలం . స్థలం లేకుండా కాలం లేదు, కాలం లేకుండా స్థలానికి అర్థం లేదు. శివ, విష్ణువులు ఒకే అనంతమైన వాస్తవికతకు రెండు ప్రతిబింబాలు అంటూ అద్భుతమైన ఆధ్యాత్మికను తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ధర్మం కోసం అవతరణ..

అంతేకాక, ఆమె మరొక పోస్ట్‌లో ధర్మం గురించి కూడా శక్తివంతమైన సందేశం ఇచ్చారు. "ప్రపంచంలో ధర్మం కనుమరుగైనప్పుడు.. ఆయన తొందరపడడు. వేచి చూస్తాడు. పరిశీలిస్తాడు. సత్యం మరచిపోయినప్పుడు, అప్పుడు ఆయన తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆయన భూమిని, సింహాసనాన్ని ఆక్రమించడానికి రాడు. కానీ మనిషిలోని నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొల్పడానికి అవతరిస్తాడు. ధర్మం అనేది ఉద్ధరించడానికి పుస్తకం కాదు, అది విశ్వాన్ని నిలబెట్టే సమతుల్యత. ఆ సమతుల్యత తప్పినప్పుడు, కాల పరిరక్షకుడైన ఆయన ఉదయిస్తాడు. యుగయుగాలుగా ఆయన ఆగకుండా, నిశ్శబ్దంగా అవతరిస్తాడని చెప్పుకొచ్చింది రేణూ. ఈ లోతైన ఆధ్యాత్మిక సందేశాలు, కాశీ యాత్రలోని అరుదైన అనుభవాలను రేణూ దేశాయ్ తన అభిమానులతో పంచుకోవడం చూస్తుంటే, ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత ప్రగాఢంగా ఉందో అర్థమవుతోంది.  ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ లు నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)