Buchibabu Sana: 'పెద్ది' డైరెక్టర్ లక్కీ ఛాన్స్.. బాలీవుడ్ కింగ్‌తో పాన్-వరల్డ్ మూవీ!

Buchibabu Sana: 'పెద్ది' డైరెక్టర్ లక్కీ ఛాన్స్.. బాలీవుడ్ కింగ్‌తో పాన్-వరల్డ్ మూవీ!

తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇప్పుడు ఈయన గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఉప్పెన' మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'ని రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే దీని తర్వాత బుచ్చిబాబు చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఊహించని అంచనాలు మొదలయ్యాయి. అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 

కింగ్ ఖాన్ షారుక్‌తో చర్చలు!

దర్శకుడు బుచ్చిబాబు సానా తదుపరి ప్రాజెక్ట్ ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో ఉండబోతోంది సినీ ఇండస్ట్రీ ఫుల్ టాక్ వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడానికి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటీవల మైత్రి ప్రతినిధులు షారుక్ ఖాన్‌ను కలిసి, బుచ్చిబాబు రూపొందించిన ఒక అద్భుతమైన కథాంశాన్ని వివరించారని తెలుస్తోంది. ఇది షారుక్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్‌తో మైత్రి మూవీ మేకర్స్ చేతులు కలపడం, దానికి దర్శకుడిగా బుచ్చిబాబును ఎంపిక చేయడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

భారీ బడ్జెట్‌తో.. 

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో బిగ్గెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా సుమారు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుందని సమాచారం. బుచ్చిబాబు తన రెండవ సినిమానే రామ్ చరణ్‌తో పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నప్పటికీ.. మూడో ప్రాజెక్ట్‌ను ఏకంగా భారీ బడ్జెట్‌తో షారుక్ ఖాన్‌తో చేయబోతున్నారనే వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుచ్చిబాబు కథ చెప్పే విధానం, ఆయన టేకింగ్‌లోని ఫ్రెష్‌నెస్, భావోద్వేగాలను బలంగా తెరపై చూపించే సామర్థ్యం... షారుక్ ఖాన్ లాంటి స్టార్‌కు సరిగ్గా సరిపోతుందని మైత్రి టీమ్ బలంగా నమ్ముతోందట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటన ఎప్పుడు?

ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత షారుక్ ఖాన్‌తో బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే, బుచ్చిబాబు సానా ఇండియన్ సినిమా దర్శకత్వ చరిత్రలో అత్యంత వేగంగా పాన్-వరల్డ్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగిన అతికొద్ది మంది దర్శకులలో ఒకరిగా నిలిచిపోతారు. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సంచలన కాంబో గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.