పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కేబినెట్లోని మంత్రులు సత్తా చాటారు. మొత్తం 29 మంది మంత్రుల్లో 27 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ 27 మందిలో 12 మంది జేడీయూ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. అయితే.. వీళ్లలో మళ్లీ ఎంతమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ సొంతంగానే 89 స్థానాల్లో గెలుపొందడం.. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న లోక్ జన్ శక్తి (RV) పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించడం.. హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ 5 స్థానాల్లో గెలిచాయి.
ఇతరులు 9 మందిని కలుపుకుని ముందుకు పోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బీజేపీకి జేడీయూతో పనే లేదని.. నితీష్ను పక్కన పెట్టేయొచ్చనే వాదన కూడా తెరపైకొచ్చింది. దీంతో.. నితీష్ కేబినెట్లో జేడీయూ మంత్రులకే కాదు.. నితీష్ ముఖ్యమంత్రి పీఠానికే గ్యారంటీ లేని పరిస్థితులు రావొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే గానీ జరిగితే.. బిహార్ రాజకీయాలను బీజేపీ కీలక మలుపు తిప్పినట్టే.
►ALSO READ | బీహార్ ఫలితాలపై రాహుల్ విస్మయం.. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపణ
