పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులకు ఆయన స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇతర పార్టీలకు చోటు లేకుండా కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అనంతరం, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వీపనగండ్ల మాజీ జడ్పీటీసీ బాలకృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాణ్ రావుచ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.