- పీయూ బీసీ విద్యార్థి సంఘం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కులస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం నాయకులు యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఆదివారం ధర్నా చేశారు. అనంతరం పీయూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తయ్యప్ప మాట్లాడుతూ పసిబిడ్డను కాలితో తన్ని చంపిన అగ్రకులం వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అరుణ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేందర్, అక్షయ్, మహేశ్, రవి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
