ఎడపల్లిలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

ఎడపల్లిలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

ఎడపల్లి, వెలుగు :  మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం  ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదు.