శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ :  టీటీడీ మే నెల దర్శనం టికెట్ల కోటా రిలీజ్.. ఎప్పుడంటే..!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ :  టీటీడీ మే నెల దర్శనం టికెట్ల కోటా రిలీజ్.. ఎప్పుడంటే..!

దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి మే నెల దర్శన కోటా కు సంబంధించి కీలక అప్ డేట్ విడుదల చేసింది టీటీడీ. మే నెలకు సంబంధించిన దర్శన కోటా, గదుల కోటా విడుదల వివరాలు వెల్లడించింది టీటీడీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .!

 టోకెన్లు విడుదల కోటా వివరాలు

  • ఫిబ్రవరి 23 న  అంగ ప్రదక్షిణ టోకెన్లు .. ఉదయం 10 గంటలకు
  • ఫిబ్రవరి 23 న శ్రీవాణి దర్శనటికెట్ల కోటా రిలీజ్​  .. ఉదయం 11 గంటలకు

 వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల వివరాలు

  • ఫిబ్రవరి 24న ప్రత్యేకదర్శనం కోటాటికెట్లువిడుదల..ఉదయం 10 గంటలకు ఆన్​ లైన్​లో 
  • ఫిబ్రవరి 24న తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లు విడుదల..మధ్యాహ్నం 3గంటలకు ఆన్​ లైన్​లో
  • ఫిబ్రవరి 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 

ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.  https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచించింది టీటీడీ.

►ALSO READ | గోవిందా... ఏంటీ ఘోరం..! : తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము..