జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో.. హీరో బాలకృష్ణ ఇంటి దగ్గర ఫెరారీ కారు బీభత్సం..

జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో.. హీరో బాలకృష్ణ ఇంటి దగ్గర ఫెరారీ కారు బీభత్సం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది.  రోడ్ నెం 45 లో ఓవర్ స్పీడుతో డివైడర్ దాటి ఎదురు రోడ్డుపై వస్తున్న వాహనాలను ఢీకొట్టింది.  నటుడు బాలకృష్ణ ఇంటి ముందరే ఈ ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై యాక్సిడెంట్ జరగటంతో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. 

ఆదివారం (ఫిబ్రవరి 22) ఉదయం జరిగిన ఈ యాక్సిడెంట్ లో పలువురికి గాయాలయ్యాయి. కారు ఓవర్ స్పీడుతో కరెంటు పోల్ ను ఢీకొట్టడంతో.. పోల్ వంగిపోయింది. డివైడర్ పై నుంచి దూసుకెళ్లిన కారు.. ఎదురుగా ఉన్న కార్లు, బైకులను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో.. వెనక నుంచి వచ్చిన కార్లు ఒకదానికి ఒకటి వరుసగా ఢీకొన్నాయి. దీంతో రెండు మూడు కార్లు డ్యామేజయ్యాయి. 

►ALSO READ | కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్.. రాజాసింగ్ అరెస్ట్.. కామారెడ్డికి వెళ్లే అన్ని రూట్లలో చెక్ పోస్టులు..

ఈ ప్రమాదంలో ఫెరారీ కారు ధ్వంసమైంది. గాయాలైన ప్రయాణికులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో యాక్సిడెంట్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.