సోమవారం మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభంలోనే IDFC ఫస్ట్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల షేర్లు భారీగా పతనమయ్యాయి. హర్యానా ప్రభుత్వం ఈ రెండు బ్యాంకులను ప్రభుత్వ లావాదేవీల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. అసలు బ్యాంకుల్లో జరిగిన ఫ్రాడ్ ఏంటి.. దాని ప్రభావం కంపెనీలపై ఎంత వరకూ ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఏం జరిగింది..?
హర్యానా ఆర్థిక శాఖ ఫిబ్రవరి 18, 2026న ఒక సంచలన సర్క్యులర్ జారీ చేసింది. IDFC ఫస్ట్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇకపై ఎలాంటి ప్రభుత్వ నిధులను డిపాజిట్ చేయకూడదని.. ఇప్పటికే ఉన్న నిధులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు, బోర్డులు, కార్పొరేషన్లు తమ ఖాతాలను నేషనలైజ్డ్ బ్యాంకులకు మార్చుకోవాలని స్పష్టం చేసింది.
బ్యాంకుల్లో జరిగిన 'ఫ్రాడ్' వివరాలు..
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బ్యాంకుల్లో వెలుగుచూసిన ఆర్థిక అవకతవకలే. IDFC ఫస్ట్ బ్యాంక్‌లోని చండీగఢ్ బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి దాదాపు రూ.590 కోట్ల మేర మోసం జరిగినట్లు బ్యాంక్ స్వయంగా వెల్లడించింది. ఒక ప్రభుత్వ విభాగం తన ఖాతాను క్లోజ్ చేసి నిధులను బదిలీ చేయమని కోరినప్పుడు.. బ్యాంక్ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్‌కు, ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలకు మధ్య భారీ తేడా కనిపించింది. దీనిపై విచారణ జరపగా.. నలుగురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వారిని బ్యాంక్ సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
►ALSO READ | ఇరాన్ అమెరికా యుద్ధ భయం: సోమవారం భారీగా పెరిగిన వెండి.. రూ.16వేలు దాటేసిన గ్రాము గోల్డ్..
ఇక AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ప్రభుత్వ ఖాతాల నుంచి సుమారు రూ.47 కోట్లు ఒక ప్రైవేట్ కస్టమర్ ఖాతాకు 14 లావాదేవీల ద్వారా అక్రమంగా బదిలీ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, అంతర్గత విచారణ జరుపుతున్నామని బ్యాంక్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ నిధులను అధిక వడ్డీ ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచకుండా.. బ్యాంకులు తమ స్వార్థం కోసం తక్కువ వడ్డీ వచ్చే సేవింగ్స్ ఖాతాల్లోనే అట్టిపెట్టుకున్నాయని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని హర్యానా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో హర్యానా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ బ్యాంకుల షేర్లు దాదాపు 20 శాతం వరకూ కుప్పకూలాయి. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
