ఇరాన్ అమెరికా యుద్ధ భయం: సోమవారం భారీగా పెరిగిన వెండి.. రూ.16వేలు దాటేసిన గ్రాము గోల్డ్..

ఇరాన్ అమెరికా యుద్ధ భయం: సోమవారం భారీగా పెరిగిన వెండి.. రూ.16వేలు దాటేసిన గ్రాము గోల్డ్..

ఇరాన్ పై అమెరికా దాడి చేసేందుకు భారీగా సన్నాహాలు చేసుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అమెరికా ఒకపక్క చర్చలు అంటూనే యుద్ధానికి తయారవటం చూస్తుంటే అకాట్ చేయటం పక్కా అంటున్నారు నిపుణులు. దీనికి తోడు ఇరాన్ కి ఇచ్చిన డెడ్ లైన్ కూడా దగ్గర పడుతున్న వేళ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న భయాలతో గోల్డ్, సిల్వర్ లాంటి లోహాలకు తిరిగి డిమాండ్ పెరుగుతోంది. కొన్ని వారాలుగా తగ్గుతూ పోయిన వీటి ధరలు యుద్ధ వాతావరణంతో మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా తాజా రేట్లను పరిశీలించండి. 

ఫిబ్రవరి 23న బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. దీంతో ఫిబ్రవరి 22 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.207 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 135గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 790గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : రష్యా నుంచి తగ్గిన ఆయిల్ కొనుగోళ్లు..

ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీ తిరిగి పుంజుకుందని నిపుణులు అంటున్నారు. అయితే సోమవారం ఫిబ్రవరి 23, 2025న వెండి రేటు కేజీకి రూ.25వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.