రష్యా నుంచి తగ్గిన ఆయిల్ కొనుగోళ్లు.. సౌదీ వైపు ఇండియా మొగ్గు

రష్యా నుంచి తగ్గిన ఆయిల్ కొనుగోళ్లు.. సౌదీ వైపు ఇండియా మొగ్గు
న్యూఢిల్లీ: ఇండియా క్రూడాయిల్ దిగుమతుల్లో  మార్పులు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు తగ్గగా, సౌదీ అరేబియా నుంచి పెరుగుతున్నాయి. కమొడిటీ ఇంటెలిజెన్స్ కంపెనీ కెప్లర్ ప్రకారం, ఇండియా ఈ నెల 1–18  మధ్య  4.85 మిలియన్ బ్యారెల్స్‌‌‌‌ పెర్ డే (బీపీడీ) దిగుమతి చేసుకుంది.  ఇది జనవరిలో జరిగిన 5.25 మిలియన్ బీపీడీ కంటే 8శాతం తక్కువ. యూఎస్‌, యూరప్  ఆంక్షల కారణంగా రష్యా నుంచి  సరఫరాలు తగ్గాయి. ఈ దేశం నుంచి  డిసెంబర్ 2025లో 1.28 మిలియన్ బీపీడీ  సరఫరా కాగా,  జనవరిలో 1.22 మిలియన్ బీపీడీకి, ఫిబ్రవరిలో 1.09 మిలియన్ బీపీడీకి ఇది పడిపోయింది.  రష్యా క్రూడ్ దిగుమతులు  మార్చిలో 0.8–1.0 మిలియన్ బీపీడీకి తగొచ్చని కెప్లర్ అంచనా వేస్తోంది.  2024–25లో ఉన్న  పీక్‌‌‌‌ లెవెల్‌‌‌‌ 1.6–1.8 మిలియన్ బీపీడీకి తిరిగి చేరే అవకాశం తక్కువ.   మరోవైపు క్రూడాయిల్ సరఫరాలో నెలకొన్న  గ్యాప్‌‌‌‌ను భర్తీ చేయడానికి  సౌదీ నుంచి ఆయిల్ సరఫరాని ఇండియా పెంచింది. ఫిబ్రవరిలో ఈ దేశం నుంచి ఆయిల్ దిగుమతులు 1.0–1.1 మిలియన్ బీపీడీకి చేరాయి.