కుర్నాపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ

కుర్నాపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ఎడపల్లి, వెలుగు : మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతి ష్ఠాపన నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఎల్లమ్మ దేవత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణా హుతి, మహామంగళ నీరాజనం, కుంకుమ పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పరిగె సాయిలు. మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మహేశ్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.