దోస్త్ థర్డ్ ఫేజ్​లో 72,949 మందికి సీట్లు

దోస్త్ థర్డ్ ఫేజ్​లో 72,949 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మూడో విడతలో 72,949 మందికి సీట్లు అలాట్ చేశారు. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, సెక్రెటరీ ఎన్.శ్రీనివాస్ రావు దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలతోపాటు ఇంట్రా కాలేజ్, స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. కాగా, దోస్త్ మూడో విడతలో కొత్తగా మొత్తం 79,356 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో 72,949 మందికి  సీట్లు అలాట్ కాగా, మరో 6407 మంది తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో సీట్లు అలాట్ కాలేదు. 

సీట్లు పొందిన వారిలో ఆర్ట్స్ గ్రూపుల్లో 10,939 మంది ఉండగా, కామర్స్ 32,209 మంది, లైఫ్ సైన్సెస్ లో 16,859 మంది, ఫిజికల్ సైన్సెస్​లో 12,620 మంది, డీఫార్మసీలో 235 మంది, ఇతర గ్రూపుల్లో మరో 87 మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఈ నెల 22 నుంచి 25 వరకు ఆన్​లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. ఈ క్రమంలోనే కాలేజీల్లోనూ రిపోర్టు చేయాలని కోరారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంట్రా కాలేజీ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని.. వారికి 31న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 

ఆగస్టు1 నుంచి స్పెషల్ ఫేజ్ 

దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల రిజిస్ర్టేషన్​ప్రక్రియ ఆగస్టు1 నుంచి 11 వరకు కొనసాగనుంది.12 వరకు వెబ్ఆప్షన్ల ప్రక్రియ, 11న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 16న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. 19లోగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టుతో పాటు కాలేజీల్లోనూ రిపోర్టు చేయాలి.