శంకర్‌‌‌‌పల్లిలో చందన బ్రదర్స్‌‌ షాపింగ్ మాల్‌‌

శంకర్‌‌‌‌పల్లిలో చందన బ్రదర్స్‌‌ షాపింగ్ మాల్‌‌

హైదరాబాద్, వెలుగు :  చందన బ్రదర్స్‌‌ శంకర్‌‌‌‌పల్లిలో  కొత్త షాపింగ్‌‌ మాల్‌‌ను  ఓపెన్ చేసింది. ఎంఎల్‌‌ఏ కాలె యాదయ్య, ఎంఎల్‌‌సీ పట్నం మహేందర్ రెడ్డి, సినీ నటి నేహ శెట్టి ఈ కొత్త మాల్‌‌ను  ప్రారంభించారు.  శంకర్‌‌‌‌పల్లి ప్రజలు హైదరాబాద్ వంటి సిటీలకు వెళ్లకుండా, తామున్న చోటే అంతర్జాతీయ షాపింగ్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందిస్తున్నామని చందన బ్రదర్స్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.

కుటుంబం మొత్తానికి అవసరమయ్యే దుస్తులు తమ దగ్గర దొరుకుతాయని పేర్కొంది. కొత్త షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ ఆపర్లను  ఇస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ పేర్కొన్నారు.  ఈ మాల్‌‌తో 150 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.