న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హాను రాష్ట్ర బీజేపీ ఎంపీలు మార్యదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలోని దీన్ దయాల్ మార్గ్ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నితిన్ నబీన్ సిన్హాను ఎంపీలు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడెం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
