సమష్టి కృషితోనే మాదక ద్రవ్యాల నిర్మూలన : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా

సమష్టి కృషితోనే మాదక ద్రవ్యాల నిర్మూలన : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
  •     ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు విద్యాశాఖ, రెవెన్యూ, ఆరోగ్య శాఖలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని వివరించారు. రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారుల ద్వారా గంజాయి రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. మెడికల్ షాపుల్లో నిషేధిత డ్రగ్స్ విక్రయం, దుర్వినియోగం జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, అడిషనల్​కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, డీపీవో రమేశ్, డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్, డీఏవో  శ్రీధర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమాశ్రీ, ఆర్అండ్​బీ ఈఈ నర్సయ్య పాల్గొన్నారు.