ఇంకో 6 నెలల్లో వీ 5జీ సర్వీస్‌‌లు

ఇంకో 6 నెలల్లో వీ 5జీ సర్వీస్‌‌లు

న్యూఢిల్లీ : ఇంకో ఆరు నెలల్లో 5జీ సర్వీస్‌‌లు అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్ ఐడియా (వీ) సీఈఓ అక్షయ మూండ్ర  పేర్కొన్నారు.  5జీ  కోసం వెండర్లతో మాట్లాడుతున్నామని,  ఓపెన్‌‌రాన్‌‌, వీరాన్ టెక్నాలజీల   ట్రయల్స్‌‌ చివరి దశలో ఉన్నాయని అన్నారు. ‘5జీ సర్వీస్‌‌లను ఇప్పుడు లాంచ్ చేయడం ద్వారా  క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ను సమర్ధవంతంగా వాడుకోగలుగుతాం. నాలుగు సర్కిల్స్‌‌ కోసం  అనుమతులు అందుకున్నాం.

బిహార్‌‌‌‌, ముంబై సర్కిల్స్‌‌ కోసం అప్లికేషన్ పెట్టాం. 5జీ కోసం టెక్ పార్టనర్లతో చర్చలు జరుపుతున్నాం’ అని అక్షయ అన్నారు. 5జీ డివైజ్‌‌లు ఎక్కువగా ఉన్న ఏరియాలు లేదా సిటీలపై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు.  ఎయిర్‌‌‌‌టెల్‌‌, జియో ఇప్పటికే 5జీ సర్వీస్‌‌లను లాంచ్ చేశాయి.