ర్యాలీ కొనసాగిస్తున్న గోల్డ్.. యుద్ధం వేళ వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ర్యాలీ కొనసాగిస్తున్న గోల్డ్.. యుద్ధం వేళ వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇరాన్ యుద్ధం రోజురోజుకూ నెమ్మదిస్తున్న వేళ బంగారం రేట్లకు తిరిగి రెక్కలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు తిరిగి పెరుగుతుండటంతో భారతీయ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు మరింతగా పెరగకమునుపే షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తమకు దగ్గరలో ఉన్న నగరాల్లో తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

మార్చి 11న బంగారం రేట్లు పెరిగాయి. దీంతో మార్చి 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.93 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 331గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 970గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 11, 2026న దేశవ్యాప్తంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.