
- డీఆర్‌హెచ్‌పీ పేపర్లను విత్‌డ్రా చేసుకున్న కంపెనీ
న్యూఢిల్లీ : 450 మిలియన్ డాలర్ల (రూ.3,735 కోట్ల) ను సేకరించడానికి రెడీగా ఉన్న ఓయో, తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) పేపర్లను సెబీ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంది. ఫండ్స్ సేకరించిన తర్వాత మళ్లీ ఐపీఓ పేపర్లను ఫైల్ చేయనుంది. ఏడాదికి 9 శాతం నుంచి 10 శాతం వడ్డీ దగ్గర డాలర్ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ సేకరించనుంది.
ఈ ప్రాసెస్‌ను జేపీ మోర్గాన్ లీడ్ చేయనుంది. ఇప్పటికే ఉన్న అప్పులకు రీఫైనాన్సింగ్ చేయడానికి ఓయో ఫండ్స్ సేకరిస్తోంది. ఐపీఓ ద్వారా రూ.8,430 కోట్లు సేకరించేందుకు సెబీ వద్ద ఐపీఓ పేపర్లను 2021 సెప్టెంబర్‌లో కంపెనీ సబ్మిట్ చేసింది. మార్కెట్ వోలటాలిటీలో ఉండడంతో కంపెనీ ఐపీఓ రాలేదు. ఓయో వాల్యుయేషన్ కూడా 11 బిలియన్ డాలర్ల నుంచి 4–6 బిలియన్ డాలర్లకు పడిపోయింది.