స్పెషల్ సెషన్‌‌లో మార్కెట్ అప్‌‌

స్పెషల్  సెషన్‌‌లో మార్కెట్ అప్‌‌

ముంబై : సెన్సెక్స్‌‌, నిఫ్టీ శనివారం నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌‌లో లాభాల్లో కదిలాయి. నిఫ్టీ  36 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 22,502  దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 74,005 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ మీడియా, ఎనర్జీ, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్‌‌లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీలో నెస్లే ఇండియా

పవర్‌‌‌‌ గ్రిడ్‌‌, టాటా మోటార్స్‌‌, అదానీ పోర్ట్స్‌‌, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగియగా, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్‌‌ సిమెంట్‌‌, ఎల్‌‌టీఐమైండ్‌‌ట్రీ, మారుతి షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. మహారాష్ట్రలో ఎన్నికలు ఉండడంతో సోమవారం మార్కెట్‌కు సెలవు.