Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలోని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీలకు లేని పాపులారిటీ దీనికి రోజులు గంటల్లో వస్తుండటం అస్సలు మింగుడు పడటం లేదు పెద్ద పెద్ద పార్టీలకు కూడా. ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ పార్టీని దేశానికి ముప్పుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశ భద్రతల దృష్ట్యా దీనికి చెందిన సోషల్ మీడియా పేజీలను మన దేశంలో కనిపించకుండా బ్లాక్ చేయాలంటూ కేంద్రం డిసైడ్ అవ్వటం చూస్తుంటే ఇదొక ఆన్ లైన్ జెన్ జెడ్ మూమెంట్ గా మారుతుందనే భయాలు ప్రభుత్వ పెద్దలకు వెంటాడుతున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ ఆసక్తికరమైన వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ ఇన్ స్టా అకౌంట్లో ఉన్న ఫాలోవర్లలో 49 శాతం అంటే దాదాపు సగం మంది పాకిస్థాన్ కి చెందిన వారేనని మిగిలిన వారిలోనూ మెజారిటీ సభ్యులు అమెరికా, బంగ్లాదేశ్, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెగ వైరల్ అవుతోంది. అంటే మెుత్తంగా ఈ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లో 9 శాతం మంది మాత్రమే ఇండియన్ యూజర్లంటూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో అస్సలు వాస్తవం లేదంటూ అభిజీత్ అసలు వివరాలను బయటపెట్టారు.
I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026
Why would you call 94% of Indian youth as Pakistanis? https://t.co/547NtEP934 pic.twitter.com/9DRTx6l96e
కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసేందుకు కొందరు రేయింబవళ్లు కష్టపబడుతున్నారని అభిజీత్ పేర్కొన్నారు. తమ్ముళ్లూ కొద్దిగా రెస్ట్ తీసుకోండి అంటూ ఈ ప్రయత్నాలపై వ్యంగ్యంగా ఎక్స్ పోస్టు కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం జెన్ జెడ్ యూత్ నుంచి మంచి ఆదరమ కారణంగా కాక్రోచ్ పార్టీ అకౌంట్ సభ్యుల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. అంటే దాదాపు 2 కోట్ల మంది యూజర్లు మద్దతుగా నిలుస్తున్నారు. వీరిలో 94.7 శాతం మంది భారతీయ ఫాలోవర్లు ఉన్నట్లు అభిజీత్ పంచుకున్న స్కీన్ షార్ట్ నిరూపించింది. ఆ తర్వాత అమెరికా, యూకే, కెనడా, యూఏఈ నుంచి మెుత్తంగా 3 శాతం కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నట్లు ఇందులో తేలింది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి అనేక దేశాల్లోని రాజకీయ పార్టీలను జెన్ జెడ్ మూమెంట్స్ ఏ స్థాయిలో ప్రభావితం చేశాయి, కొన్ని చోట్ల ప్రభుత్వాలను కూడా ఎలా మార్చేశాయో మనం చూశాం. అయితే భారతదేశంలోని బీజేపీ లాంటి పార్టీలను ప్రస్తుతం వెంటాడుతున్న భయం కూడా అదే అనిపిస్తోంది అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
