62 ఏళ్లలో చావును గెలిచాడు..సముద్రంలో బోటు మునిగి 2 రోజుల తర్వాత ఒడ్డుకి..

62 ఏళ్లలో చావును గెలిచాడు..సముద్రంలో బోటు మునిగి 2 రోజుల తర్వాత ఒడ్డుకి..

62 ఏండ్ల వయసులో చావును గెలిచి ఒడ్డున పడ్డాడు ఇతను.  పేరు స్టువర్ట్ బీ.శుక్రవారం సాయంత్రం టైమ్ లో 32 అడుగుల పొడవైన బోట్ లో ఫ్లోరిడాలోని కేప్ మెరీనా నుంచి సముద్రంలో షికారు కెళ్లాడు . కానీ ఆ రాత్రి నడి సముద్రంలో ఉన్న అతడి బోట్ లోకి ఉన్నట్టుండి  నీళ్లు రావడంతో అది క్షణాల్లో మునిగిపోయింది. ప్రొఫెషనల్ డైవింగ్ తెలిసిన వ్యక్తి కావడం, ఈత బాగా వచ్చి ఉండడంతో ధైర్యంగా బోటులో నుంచి బయటపడ్డాడు . బోటు నీటిలో పూర్తిగా మునిగిపోయాక దాని అంచుపై వేలాడుతూ శుక్రవారం, శనివారం రెండు రాత్రులు తిండీ, నీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యూఎస్
కోస్ట్ గార్డు షిప్ స్టువర్ట్ బీని కాపాడింది. మంగళవారం ఉదయం ఒడ్డుకు చేరాడు.