నటి హేమ వెళ్లిన పబ్ లో డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది వీళ్ళకే..లిస్ట్ లో బడా బాబుల పిల్లలు..!

నటి హేమ వెళ్లిన పబ్ లో డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది వీళ్ళకే..లిస్ట్ లో బడా బాబుల పిల్లలు..!

హైదరాబాద్ లోని క్వాక్ ఎరీనా పబ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈగల్ టీం పోలీసులు. ఇదే పబ్ లో నటి హేమ కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తాను మళ్ళీ పబ్ కి వచ్చానని.. ఈగల్ టీం పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందంటూ హేమ  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో క్వాక్ ఎరీనా పబ్ లో డ్రగ్స్ టెస్ట్ లో  పాజిటివ్ వచ్చినవారి లిస్ట్ రిలీజ్ చేశారు పోలీసులు.

డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినవారిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఆకెళ్ళ హరిత్ సారంగ్ అనే వ్యక్తి ఓ ఐఏఎస్ అధికారిని కొడుకు అని తెలుస్తోంది.

డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది వీళ్ళకే:

  • రితేష్ 
  • జ్యోతిరాధిత్య 
  • రిత్విక్ వాసాల 
  • అభిషేక్ వర్మ
  • ఆకెళ్ళ హరిత్ సారంగ్ 
  • రిషబ్ శ్రీవాత్సవ
  • పిట్ల ప్రిథ్వీరాజ్ 
  • మోనిష్ సత్వాని

డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన 8మందికి ఎర్రగడ్డ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. అనంతరం 8 మందిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని తెలిపారు పోలీసులు. పాజిటివ్ వచ్చిన 8 మందిలో ఆరుగురికి గంజాయి పాజిటివ్, మరో ఇద్దరికి mdma, మరో డ్రగ్ కలిసి తీసుకున్నట్లు నిర్దారణ అయినట్లు తెలిపారు పోలీసులు.

డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ లింక్ లు బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో ఏపీ ఎంపీ, ఇప్పుడు పబ్ కేసులో ఏపీ IAS అధికారిని కుమారుడు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.