KPHB, ఎల్బీనగర్ లలో అగ్ని ప్రమాదాలు.. పూర్తిగా దగ్ధమైన ఇండ్లు !

KPHB, ఎల్బీనగర్ లలో అగ్ని ప్రమాదాలు.. పూర్తిగా దగ్ధమైన ఇండ్లు !

హైదరాబాద్ లోని KPHB, ఎల్బీనగర్ లలో ఒకేసారి అగ్నిప్రమాదాలు సంభవించాయి. శుక్రవారం (ఏప్రిల్ 03) జరిగిన ఫైర్ యాక్సిడెంట్లలో ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లోని ఫర్నిచర్ అంతా మంటల్లో మాడిపోయింది. రెండు చోట్ల ఒకేసారి ఘటనలు జరగటం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్బీ కాలనీలోని వసంత నగర్ ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.  ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఏసీ ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఇల్లంతా అంటుకవడంతో ఫర్నిచర్ పూర్తిగా దెబ్బదిన్నదనీ.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. 

విద్యుత్ హెచ్చుతగ్గులతోనే ఎల్బీనగర్ లో..

KPHB ప్రమాదం జరిగిన వెంటనే అటు ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని భవానీ నగర్ కాలనీలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది..మంటలను ఆర్పివేశారు.  విద్యుత్ హెచ్చుతగ్గులతోనే షార్ట్ సర్క్యూట్ అయినట్లు సమాచారం. తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.