V6 News

పీర్జాదిగూడలో గాలివానకు కూలిన హోర్డింగ్

పీర్జాదిగూడలో గాలివానకు కూలిన హోర్డింగ్
  •     ఖాళీ స్థలంలో పడటంతో తప్పిన ప్రమాదం

మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ బుధవారం మధ్యాహ్నం కురిసిన గాలివానకు కూలిపోయింది. అయితే పక్కనే ఉన్న ఖాళీ జాగాలో పడడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలంలోని 11 కేవీ కరెంట్ ​వైర్లపై హోర్డింగ్​ పడడంతో  రెండు స్తంభాలు కూలాయి. 2 గంటల పాటు కరెంట్​సరఫరా నిలిచిపోయింది.

పక్కనే ఉన్న గ్యారేజీకి రిపేరుకు వచ్చిన కారు నుజ్జునుజ్జయింది. హోర్డింగ్​కు పర్మిషన్​ఇవ్వొద్దని సీడీఎంఏతో పాటు పీర్జాదిగూడ కార్పొరేషన్ అధికారులకు 7 నెలల కిందట ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.