అత్యాధునిక వసతులతో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించాం

అత్యాధునిక వసతులతో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించాం

సికింద్రాబాద్ కార్ఖానాలో నిర్మించిన కొత్త పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు హోం మంత్రి మహమూద్ ఆలీ. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.  అత్యాధునిక వసతులతో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించామన్నారు హోంమంత్రి మహమూద్ ఆలీ. అనంతరం డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో ఆరున్న‌ర ల‌క్ష‌ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌డంలో కాల‌నీ వాసుల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర ప్ర‌ముఖుల పాత్ర ఉంద‌న్నారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల‌తో స‌మానం. పోలీసు వ్య‌వ‌స్థ గురించి ప్ర‌జ‌ల‌కు తెలియాలి. నేరం జ‌ర‌గ‌క‌ముందే నేర‌స్తుల‌ను గుర్తిస్తే స‌మాజం పోలీసు శాఖ‌ను మ‌రింత హ‌ర్షిస్తుంద‌న్నారు. నేరాల నివార‌ణ కోసం న‌గ‌రంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామాల్లో కూడా కెమెరాల‌ను ఏర్పాటు చూసుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో సృజ‌నాత్మ‌క‌త వ‌చ్చింద‌న్నారు. నేరం జ‌ర‌గ‌కముందే వాటిని అరిక‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసు శాఖ‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింద‌న్నారు. కేసుల విష‌యంలో రాష్ర్టమంతా ఒకే ర‌క‌మైన విధానాన్ని అవ‌లంబిస్తున్నామ‌ని తెలిపారు.