తెలివిగల చిలుక

తెలివిగల చిలుక
  • బ్రూస్​ చాలా షార్ప్​

కాకులు తెలివైనవని.. గులక రాళ్లతో కుండలో నీటిని పైకి తెచ్చాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఓ చిలుక తనకూ బ్రెయిన్‌‌‌‌ ఉందని నిరూపిస్తోంది. విరిగిన తన ముక్కుకు బదులుగా గులక రాళ్లతో రెక్కలను క్లీన్‌‌‌‌ చేసుకుంటోంది. న్యూజిలాండ్‌‌‌‌ విల్లోబ్యాంక్ వైల్డ్‌‌‌‌లైఫ్ రిజర్వ్‌‌‌‌లో బ్రూస్‌‌‌‌ పేరున్న కియా(చిలుక జాతిలో పెద్దది) చిలుక ఉంది. ఓ యాక్సిడెంట్‌‌‌‌లో దాని ముక్కు చివరి భాగం విరిగిపోయింది. దాంతో దాని రెక్కలు శుభ్రం చేసుకోవడం కష్టమైపోతుందని అనుకున్నారట అక్కడి స్టాఫ్​. కానీ ఈ బ్రూస్‌‌‌‌ తన నాలుకకు, విరిగిన ముక్కుకు మధ్యలో చిన్న చిన్న గులక రాళ్లను పెట్టుకుని వాటితోనే తన రెక్కలను క్లీన్‌‌‌‌ చేసుకోవడం వారి కంటపడింది. దాంతో యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ రీసెర్చర్స్‌‌‌‌ ఈ చిలుకపై తొమ్మిది రోజుల పాటు పరిశోధన చేశారు. ఈ బ్రూస్‌‌‌‌ గులక రాళ్లనే కాదు చిన్న చిన్న వస్తువులను కూడా విరిగిన ముక్కుతో పట్టుకోవడాన్ని గుర్తించారు. ఇంతకు ముందు బ్రూస్‌‌‌‌ తన ముక్కుతో టూల్స్‌‌‌‌ను పట్టుకొని చిన్న చిన్న బాక్స్‌‌‌‌లను తెరిచేది. ఇప్పుడు అదే టెక్నిక్​ వాడి తన రెక్కలను క్లీన్‌‌‌‌ చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్రూస్‌‌‌‌ ఒక గులక రాయిని తీసుకున్నప్పుడు 95 శాతం తనను క్లీన్‌‌‌‌ చేసుకునేదని, అయితే బ్రూస్‌‌‌‌తో పాటు ఉంటున్న 12 చిలుకలు ఎప్పుడూ ఇలాంటిది చేయడం తాము చూడలేదని చెబుతున్నారు రీసెర్చర్స్‌‌‌‌. మనుషులు ఏదైనా యాక్సిడెంట్​కు గురై కాలో, చెయ్యో కోల్పోతే ఎలా వాటికి ప్రతిగా చెక్క లేదా రబ్బరు చేతులను, కాళ్లను యూజ్‌‌‌‌ చేస్తున్నారో.. అదే రీతిలో బ్రూస్‌‌‌‌ కూడా తన ముక్కుకి బదులుగా గులక రాళ్లను ఎంచుకోవడాన్ని బట్టి పక్షులకీ సొంత తెలివితేటలు ఉంటాయని, సమయం వచ్చినప్పుడు అవి బయటపడుతుంటాయని రీసెర్చర్స్ అంటున్నారు.