వికారాబాద్ లో క‌ల‌క‌లం.. కారులో వచ్చి.. మహిళ కిడ్నాప్‌

వికారాబాద్ లో క‌ల‌క‌లం.. కారులో వచ్చి.. మహిళ కిడ్నాప్‌

వికారాబాద్: వికారాబాద్ లో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. అక్కాచెలెళ్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండ‌గా కొంద‌రు దుండ‌గులు అక్క‌ ను కిడ్నాప్ చేశారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ కు గురైన యువ‌తి ఓ మెడిక‌ల్ షాప్ ఓన‌ర్ కూతురు దీపిక గా గుర్తించారు. అయితే దీపిక ను కిడ్నాప్ చేసింది ఆమె భ‌ర్త అఖిల్ అని ఆమె కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. 2016 లో ప్రేమ అఖిల్ ను పెళ్లి చేసుకున్న దీపిక.. భ‌ర్త‌తో ఉన్న విభేదాల కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలు త‌న‌ త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది. అయితే ఆదివారం సాయంత్రం తన సోదరి తో కలిసి వెళ్తున్న దీపిక‌ను కారులో వచ్చిన కొంద‌రు వ్య‌క్తులు ఆమెను కిడ్నాప్ చేశారంటూ ఆమె చెల్లెలు చెబుతున్నారు. అఖిలే దీపిక‌ను కిడ్నాప్ చేశాడంటూ ఆమె కుటుంబ స‌భ్యులు వికారాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశార‌న్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారు నెంబరు దీపిక పెళ్లి చేసుకున్న అఖిల్ కి చెందినదిగా గుర్తించామని వికారాబాద్ పీ ఎస్ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్ తెలిపారు. కారు నెంబరు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, అఖిల్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని చెప్పారు. దీపిక ఆచూకీ కోసం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.