"లాల్ సింగ్ చద్ధా"లో అమీర్ ఎమోషనల్ జర్నీ

"లాల్ సింగ్ చద్ధా"లో అమీర్ ఎమోషనల్ జర్నీ

అద్వైత్ చందన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్ధా. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ఓ అప్ డేట్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఉత్కంఠగా సాగుతున్న టీ20 ఫైనల్లో ఈ మూవీ ట్రైలర్ ను ప్రదర్శించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ విడుదల చేశారు మూవీ మేకర్స్. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో సిక్కు పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా నడవలేని, మాట్లాడలేని ఓ సిక్కు కుర్రాడు ఎలా తన జర్నీని సక్సెస్ చేసుకున్నాడు అనే కథాంశంపై ఈ చిత్రం సాగినట్టు తెలుస్తోంది.  ఫైనల్ గా ఈ సినిమా ఆద్యంతం ఎమోషనల్ గా సాగనున్నట్టు అర్థమవుతోంది. ఇలాంటి చిత్రాలు అమీర్ కు కొత్తేమీ కాదు. కానీ ఓ డబ్బింగ్ మూవీని అందరూ ఆకట్టుకునేలా ఎలా తెరకెక్కించారనేదే ముఖ్యం. ఆ విషయంలో అమీర్ పాసయినట్లే గోచరిస్తోంది. ఇక ఈ స్టార్ హీరో సరసన కరీనా కపూర్ నటిస్తోంది. అంతే కాకుండా టాలీవుడ్ నటుడు నాగ చైతన్య కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. హాలీవుడ్ లో భారీ సక్సెస్ ను అందుకున్న ఫారెస్ట్ గంపకు రిమేకే ఈ సినిమా. ఇక కరోనా కారణంగా పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగష్టు 11న ప్రేక్షకుల రాబోతుండడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

మరిన్ని వార్తల కోసం...

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్ ఇంకెన్నడు ?

గాల్లో ఆలు పంట


  •